VKB: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వికారాబాద్ నుంచి మన్నెగూడ వెళ్తున్న టిప్పర్ లారీ, ఇట్స్ కాలేజ్ దగ్గర బోల్తా పడింది. హైదరాబాద్ రోడ్డు పనులకు మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ స్టీరింగ్ అదుపుతప్పడంతో చెట్టుకు ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ డ్రైవర్, క్లీనర్ సేఫ్గా బయటపడ్డారు. ఘటనా స్థలంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.