NZB: ఆర్మూర్ పట్టణంలో పని చేసే కార్మికులకు అగ్నిమాపక కేంద్రం అధికారి విక్రమ్ ఆధ్వర్యంలో ఇవాళ అగ్ని ప్రమాదాలపై అవగాహన నిర్వహించారు. అగ్ని ప్రమాదాల వారోత్సవాలు భాగంగా ఆరో రోజు దుకాణాల్లో పనిచేసే కార్మికులకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది సురేశ్, తదితరులు పాల్గొన్నారు.