శ్రీకాకుళం మండల పరిధిలోని నైరా వ్యవసాయ కళాశాలలో ‘భూమి సుపోషణ’ పై నేషనల్ మాస్ క్యాంపెయిన్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా అసోసియేట్ డీన్ డా.జి.జోగినాయుడు మాట్లాడుతూ.. భూమి సారవంతతే పంటల దిగుబడికి మూలం అని తెలిపారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల నేల నాణ్యత తగ్గిపోతుందని పేర్కొంటూ సేంద్రియ విధానాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు.