AP: దస్తగిరి హత్యను రాజకీయం చేయడంపై YCP నేత వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. జగన్ను లక్ష్యంగా చేసుకుని మంత్రులు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గత 21 నెలల్లో 30కి పైగా రాజకీయ హత్యలు జరిగాయని, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాజకీయ హత్యలకు చంద్రబాబే పేటెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.