TG: సచివాలయంలో ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం అయింది. ఆర్టీసీ జేఏసీ నేతలతో సీనియర్ ఐఏఎస్లు వికాస్ రాజ్, దాన కిషోర్, సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిలు చర్చిస్తున్నారు. యూనియన్ నేతల డిమాండ్లు, సమస్యలను చర్చించి.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాగా, రేపటి నుంచి సమ్మెకు వెళ్తామని ఆర్టీసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.