MDK: పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాలో దారుణం జరిగింది. స్థానికుల సమాచారం..కుటుంబ కలహాల నేపథ్యంలో కొడుకుతో కలిసి భర్తను భార్య హత్య చేసింది. మాలోత్ కిషన్ (60) మద్యం తాగి తరచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి మరోసారి గొడవ జరగడంతో భార్య మాలి కాళ్లు పట్టుకోగా కొడుకు వినోద్ గొంతు నొక్కి చంపాడు.అనంతరం మృతదేహాన్ని ఇంటి ముందు నీటి తొట్టిలో పడేశారు.