MDK: పెద్ద శంకరంపేటలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 8 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు తహసీల్దార్ ప్రభుదాస్ తెలిపారు. మల్కాపూర్ వెళ్లే దారిలో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నట్లు జీపీవవో పురుషోత్తంరెడ్డి ఇచ్చిన సమాచారంతో అధికారులు ఈ దాడులు చేశారు. పట్టుబడిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి, వాల్టా చట్టం కింద భారీ జరిమానా విధిస్తున్నట్లు తహసిల్దార్ పేర్కొన్నారు.