W.G: వీరవాసరం మండలం తోలేరు రోడ్డులో పోలమూరు డ్రెయినేజీపై జరుగుతున్న వంతెన పనులను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదివారం పరిశీలించారు. పంజా వేమవరం వెళుతూ మార్గమధ్యంలో తోలేరు రోడ్డులో జరుగుతున్న పనులను పరిశీలించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.