KRNL: వివిధ కారణాల వల్ల ఓర్వకల్లు మండలం నన్నూరులో మృతిచెందిన టీడీపీ కార్యకర్తలు తలారి నాయుడు, మణి, పెద్ద దస్తగిరి మృతి పట్ల ఆదివారం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గ్రామంలోని వారి పార్థివదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు కార్యకర్తల అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.