సత్యసాయి: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రౌడీషీటర్లు, పాత నేరస్తులకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి సత్ప్రవర్తనతో జీవించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు.