GDWL: అలంపూర్ చౌరస్తా మార్కెట్ యార్డులో మొక్కజొన్నల కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని, రైతులు 12 రోజులుగా పడిగాపులు కాస్తున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా నేతలు ఈదన్న, ఎ. వెంకటస్వామి మండిపడ్డారు. సోమవారం కొనుగోలు కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం, గన్ని బ్యాగుల కొరత, సర్వర్ సమస్యల వల్ల కొనుగోళ్లు నెమ్మదించాయని విమర్శించారు.