MBNR: చిన్నచింతకుంట మండలం ఫర్దిపూర్కు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శివ సోమవారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శివ రాకతో పార్టీ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.