AP: NDA అభ్యర్థుల మద్దతుగా కోయంబత్తూరులో CM చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. వ్యాపారవేత్తలు, నిపుణులతో సమావేశమై NDAకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని, నదుల అనుసంధానంపై తమ నిబద్ధతను చాటారు. డీలిమిటేషన్ను అడ్డుకుంటున్న ఇండి కూటమి వల్ల మహిళలకు అన్యాయం జరుగుతోందని, ఆ కూటమి తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.