BDK: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘సెంట్రల్ రికార్డ్ రూమ్’ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఇవాళ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయమునకు చెందిన పాత రికార్డులను ఒకే చోట భద్రపరచడం, రికార్డుల ప్రక్షాళన చేయడం, అలాగే డిజిటలైజేషన్ ద్వారా రికార్డులను సులభంగా గుర్తించి వినియోగించుకునేలా ఆధునిక సదుపాయాలను ఈ కేంద్రంలో ఏర్పాటు చేశారు.