KMR: ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కామారెడ్డి యూనిట్ ఎన్నిక ఏకగ్రీవమైంది. అధ్యక్ష పదవితో పాటు ఇతర పోస్టులకు సింగిల్ నామినేషన్లు రావడంతో ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి డా. విజయ భాస్కర్ ప్రకటించారు. డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా శరత్, కోశాధికారిగా రాజు, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా విజయరాజు, మధుసూదన్, జ్యోతిలను ఎన్నుకున్నారు.