BHPL: కాటారం (M) నస్తురూపల్లిలో కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. ఈ మేరకు సభా వేదిక వద్ద ఏర్పాట్లను మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా విచ్చేసే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు.