SRD: మహాత్మ బసవేశ్వర 893వ జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో జోగిపేట చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొన్నారు. మహాత్మ బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికుడు, కవి, రాజనీతిజ్ఞుడుగా అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. వారి బోధనలు, ఆశయాలు ఆచరణీయమన్నారు.