NLR: బోగోలు మండలం బిట్రగుంట పరిధిలోని నేర చరిత్ర కలిగిన రౌడీ షీటర్లకు ఎస్సై రామకృష్ణ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదివారం బిట్రగుంట పోలీస్ స్టేషన్కు రౌడీషీటర్లను పిలిపించారు. ప్రవర్తన మార్చుకోవాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా నడుచుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, ప్రజలకు అసౌకర్యం కలిగించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.