ATP: CM చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీడీపీ నేత దేవినేని ధర్మతేజ పిలుపునిచ్చారు. కుందుర్పిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. రక్తదాతలకు రూ.3 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.