WGL: రాయపర్తి మండలం కొత్తూరులో అమరజీవి మహమ్మద్ గౌస్ 5వ వర్ధంతి సందర్భంగా ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి మాట్లాడుతూ.. దోపిడి పాలకులకు వ్యతిరేకంగా వర్గ, సామాజిక పోరాటాలే ప్రత్యామ్నాయమని అన్నారు.పెట్టుబడిదారీ వ్యవస్థలో అసమానతలు పెరిగాయని, ప్రజలను కులం, మతం, ప్రాంతాల పేరుతో విభజిస్తున్నారన్నారు.