KKR మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇటీవల కాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా ఐపీఎల్లోనూ అదే సీన్ పునరావృతమైంది. MIతో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్పందిస్తూ.. ఇదే ప్రదర్శన కొనసాగితే ‘మిస్టరీ స్పిన్నర్’గా గుర్తింపు పొందిన వరుణ్, ఇక ‘హిస్టరీ’గా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.