NZB: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని ఎలాంటి, వదంతులను నమ్మవద్దని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ, ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందని అన్నారు.