TPT: గరుడ వారిధిపై ప్రయాణించే ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో నిర్ణయించారు. నిన్న తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, ఏఎస్పీ రవిమనోహర్ చారి, ఆర్టీవో మురళీమోహన్ అధికారుల బృందం గరుడ వారధిపై జరుగుతున్న వరుస ప్రమాదాలపై సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.