KRNL: స్టీల్ ప్లాంట్లో ఎలాంటి ప్రమాదం జరగలేదని ప్లాంట్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. మిషన్ షట్డౌన్ ప్రక్రియలో ఫీడర్ వాల్వ్ తెరవడంతో పొగ బయటకు వచ్చినట్లు వివరించారు. పొగ ఎక్కువగా కనిపించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారని పేర్కొన్నారు. ఇది సాధారణ సాంకేతిక ప్రక్రియలో భాగమేనని, అగ్ని ప్రమాదం లేదా పేలుడు జరగలేదన్నారు. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని వెల్లడించారు.