MDK: కోర్టులో పెండింగ్లో ఉన్న బ్యాంక్ రికవరీ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ సూచించారు. బుధవారం బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని అత్యధిక కేసులు రాజీ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు.