గద్వాల జిల్లాలో విత్తనపత్తి రైతులు కంపెనీలు, ఆర్గనైజర్ల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారని NHPS జిల్లా ఛైర్మన్ గొంగళ్ల రంజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాకు వినతిపత్రం అందజేసిన ఆయన, గతేడాది 80 శాతం జీవోటీ ఫలితాలు వచ్చిన పంటకు వెంటనే చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు.