AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మత్రిమండలి సమావేశం కానుంది. ఉ.10 గంటలకు సచివాలయంలో ప్రారంభమయ్యే ఈ భేటీలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేబినెట్ తీర్మానం చేయనుంది. గ్యాస్ కొరత, LPG వినియోగదారులను PNG వైపు ప్రోత్సహించడం తదితర అంశాలపై చర్చించనుంది. ఆయా సమస్యలకు పరిష్కారంతో పాటు కొత్త పరిశ్రమలకు భూకేటాయింపులపై చర్చ జరగనుంది.