TG: శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా బీజేపీ వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ‘మతపర సమస్యలు సృష్టించాలని చూస్తోంది. అలా ఎవరు చేసినా అరెస్టులు తప్పవు. శాంతిభద్రతల దృష్ట్యా నేను కామారెడ్డికి వెళ్లలేదు. సంబంధంలేని అంశంపై బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను.. జటిలం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు.
Tags :