కృష్ణా: మచిలీపట్నంలోని ఎస్సీ హాస్టల్‌ను DMHO యుగంధర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి, హాస్టల్ పరిసరాల పరిశుభ్రత, త్రాగునీటి సరఫరా, ఆహార భద్రత ప్రమాణాలు, దోమల నివారణ చర్యలను పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా, పరిశుభ్రత సురక్షిత త్రాగునీరు, నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు ఆయన సూచించారు.