ఆస్కార్ చరిత్రలో వాల్ట్ డిస్నీ 22 పోటీ అవార్డులు, 4 గౌరవ అవార్డులతో కలిపి మొత్తం 26 ఆస్కార్లతో ఆల్టైమ్ రికార్డు సృష్టించారు. సినిమాల పరంగా చూస్తే.. బెన్-హుర్(1959), టైటానిక్(1997), ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ద రిటర్న్ ఆఫ్ ది కింగ్(2003) చిత్రాలు చెరో 11 అవార్డులతో అత్యధిక విజయాలను నమోదు చేసి చరిత్రకెక్కాయి.