KNR: జమ్మికుంటలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవో హేమలత తెలిపారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరగనున్న పరీక్షల కోసం జమ్మికుంటలో ఐదు, వావిలాలలో ఒకటి కలిపి మొత్తం ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 1,092 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్థులు పరీక్షకు 30 నిమిషాల ముందే కేంద్రాలకు చేరాలన్నారు.