కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కార్యదర్శి తొర్తి శ్రీనివాస్ సందర్శించారు. ఈ మేరకు ఆయన కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ కార్మికుల చెమటకు గౌరవం ఇవ్వాలని అన్నారు. పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.