MDK: భూ సమస్యల పరిష్కారానికే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అదనపు కలెక్టర్ నాగేష్ తెలిపారు. రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఇవాళ భూభారతి సర్వే, రెవెన్యూ భూముల రీ-సర్వే కార్యక్రమాల సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాల ద్వారా భూ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి రైతులంతా సహకరించాలని అధికారులు కోరారు.