AP: కదిరి నరసింహస్వామి రథోత్సవంలో ఎలాంటి వివాదం లేదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. ఎమ్మెల్యే అయిన తానే రథంపైకి ఎక్కలేదని.. ఎమ్మెల్యే అన్న హోదా తాను చూపించడం లేదని తెలిపారు. చిన్న మనస్తత్వం ఉన్నవాళ్లే వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు. వారి సంగతి దేవుడే చూసుకుంటాడని చెప్పారు.