KNR: సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లిలో మంగళవారం పాడి పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెన్నంపల్లి పశు వైద్యాధికారి భాగ్య లక్ష్మి మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మ్యాకల స్వప్న-సంపత్ రెడ్డి, వార్డు సభ్యులు, పాడి రైతులు, తదితరులు పాల్గొన్నారు.