ASR: రాజవొమ్మంగిలో మంగళవారం గోవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 16 గోవులను స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని ఎస్సై శివకుమార్ తెలిపారు. అవులను ఏజెన్సీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని వెల్లడించారు. గోవులను గోశాలకు తరలిస్తామన్నారు. పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.