NLG: కనగల్ మండల సర్పంచులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. కొత్త సర్పంచులు అంకితభావంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని దిశానిర్దేశం చేశారు. జవాబుదారీతనంతో సేవ చేయాలన్నారు.