సత్యసాయి: కేరళలో బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఓ.రాజగోపాల్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్ మంగళవారం కలిశారు. కేరళ చరిత్రలో తొలి బీజేపీ ఎమ్మెల్యేగా నిలిచిన రాజగోపాల్ క్రమశిక్షణ, అంకితభావం కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. ప్రజాసేవలో ఆయన రాజకీయ ప్రస్థానం గర్వకారణమని పేర్కొన్నారు.