VZM: మెరకముడిదాం మండలం భగీరథపురం గ్రామంలో జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి ఆనందరావు మంగళవారం పర్యటించారు. రైతులు రసాయనిక ఎరువులతో సేద్యం విడిచి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గుచూపాలని ఆయన కోరారు. ప్రకృతి వ్యవసాయంతో భూమిని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మానవులు కూడా ఆరోగ్యంగా జీవించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎంటి కళావతి, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు.