ATP: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం జిల్లా అరటి రైతులపై పడుతోంది. 15 రోజుల క్రితం టన్ను రూ.22 వేలు పలకగా, ప్రస్తుతం రూ.9 వేలకు పడిపోయింది. ఇక్కడి నుంచి ఇరాన్, గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. మరోవైపు వ్యాపారులు కొనుగోలుకు వెనకాడుతున్నారు. తోటల్లో పంట అలాగే ఉండటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.