SKLM: పలాస రైల్వే పాఠశాల భవనాల్లో కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభించేందుకు జరుగుతున్న పనులను మంగళవారం ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి ఎనలేనిదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మాత్రమే అడ్మిషన్లు జరుగుతాయని స్పష్టం చేశారు.