VSP: చిన వాల్తేరు ప్రభుత్వ ఛాతి ఆసుపత్రి వద్ద ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం నిరసన చేపట్టారు. నాలుగు నెలలుగా వేతనాలు అందక అప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 50ఏళ్లు దాటిన వారిని విధుల్లోంచి తొలగించడంపై ఆందోళన చెందుతున్నారు. తక్షణమే తమ బకాయిలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.