అనంతపురం నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్‌గా జిల్లా కలెక్టర్ ఆనంద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తాడిపత్రి పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్‌గా జేసీ విష్ణుచరణ్‌ను నియమించింది. జిల్లాలో మిగిలిన మున్సిపాలిటీలకు సైతం ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. పాలనాపరమైన పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.