SRD: జిల్లాలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మాణయ్య అన్నారు. సంగారెడ్డిలో జిల్లా కార్యవర్గ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలపై అనేక పోరాటాలు చేసి సంఘం అనేక విజయాలు సాధించిందని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభు, నాయకులు పాల్గొన్నారు.