ATP: కనేకల్లు మండలం రాంనగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ రామాలయ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొని శ్రీ సీతారాముల ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ నిర్మాణం గ్రామ ప్రజల ఐక్యతకు, భక్తికి నిదర్శనమని కొనియాడారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు.