KDP: శనివారం కడప పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పీ బి. రమణయ్య మాట్లాడుతూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే ఆరోగ్యకర సమాజానికి పునాది అని నొక్కి చెప్పారు. అనంతరం పోలీసు సిబ్బందితో స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎ, ఆర్ఎస్ఐ, ఇతర ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.