SKLM: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వన్ స్టాప్ కేంద్రాన్ని మంత్రి ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు వన్ స్టాప్ కేంద్రం ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు.