సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్(Mythri Movie Makers), దర్శకుడు సుకుమార్(Director Sukumar) ఇంట్లో ఐటీ సోదాలు(IT Raids) గత ఐదు రోజుల నుంచి జరుగుతున్నాయి. ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ఫ1 సినిమా(Pushpa1)కు అయిన బడ్జెట్, వసూలు చేసిన కలెక్షన్లు, పుష్ప2 (Pushpa 2) నిర్మాణానికి ఇప్పటి వరకూ ఖర్చు పెట్టిన బడ్జెట్ వివరాలు, నటీనటుల రెమ్యునరేషన్లు, ఆదాయ పన్ను చెల్లింపులు, జీఎస్టీ వంటి వివరాలను ఐటీ అధికారులు తెలుసుకున్నారు.
గత కొద్ది రోజుల నుంచి మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)పై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. ముంబైతో మైత్రీ మూవీ మేకర్స్ కు ఉన్న లింకులపై ఆరా తీసింది. ముంబైకి చెందిన ఓ బడా ఫైనాన్సర్ నుంచి మైత్రీ మూవీ మేకర్స్ డబ్బులు తీసుకున్నట్లు గుర్తించింది. బాలీవుడ్ (Bollywood)లో ఆ సంస్థ సినిమాలు నిర్మించేందుకు సిద్ధమవుతుండగా రైడ్ చేసింది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్(Hero Prabhash) కాంబోలో ఓ సినిమా చేసేందుకు మైత్రీమూవీ మేకర్స్(Mythri Movie Makers) ప్లాన్ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్సులను కూడా భారీ మొత్తంలో చెల్లించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా ఐటీ శాఖ గుర్తించింది. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 25లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) సంస్థలో గురువారం ఉదయం నుంచి తనిఖీలు చేశారు. ఐదు రోజుల తర్వాత ఐటీ శాఖ విచారణ ముగిసింది.