రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ మూవీ ట్రైలర్ రేపు ఉ.11:01 గంటలకు విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ధురంధర్’ రూ.1,300 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.