WGL: నాటుసారా నియంత్రణలో భాగంగా ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన వాహన తనిఖీల్లో ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట మండలం ముత్తోజిపేట వద్ద తనిఖీలు చేపట్టగా, నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన బానోతు రాజన్న కారులో 300 కిలోల పట్టిక, 100 కిలోల బెల్లం, 5 లీటర్ల నాటుసారను రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. నింధితుల వద్ద కారు, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.